Saturday, May 10, 2025
- Advertisement -

ప్ర‌భుత్వానికి ప‌వ‌న్ 24 గంట‌ల డెడ్‌లైన్‌…లేకుంటే ఆమ‌ర‌ణ‌దీక్ష‌

- Advertisement -

టీడీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో సారి నిప్పులు చెరిగారు. పోరు యాత్ర‌లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్ధానం కిడ్నీ బాధితులతో సమావేశమైన చ‌ర్చించారు. ప్రజలు అనారోగ్యంతో చనిపోతుంటే ఆరోగ్యశాఖా మంత్రి లేకపోవడం సిగ్గుచేటుని విమ‌ర్శించారు.

శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కొత్త మంత్రిని పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని లేకుంటే ఆమ‌ర‌ణ నిర‌హార దీక్ష‌కు దిగుతాన‌ని హెచ్చ‌రించారు. ఆపై జరిగే పరిణామాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

తనకు అధికారం లేకపోయినా సమస్యలపై స్పందిస్తున్నానని, అధికారంలో ఉన్నవారు స్పందించకుంటే ప్రజల కష్టాలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు. హెల్త్ సెక్రటరీ ఈ విషయమై స్పందించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాను తాను దాటేలోపే కీలక నిర్ణయాలు తీసుకుంటానని అన్నారు.

కిడ్నీ సమస్య ఎక్కువగా ఉన్న ఈ ఏడు మండలాలనూ ప్రత్యేక కారణాల దృష్ట్యా దీర్ఘకాలిక చర్యలకోసం మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి తీరాలి. ముక్కుపచ్చలారని చిన్న చిన్న బిడ్డలు చనిపోతున్నారు. చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ మంత్రి అచ్చెంనాయుడు ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీరంతా కలిసి నడుం బిగిస్తే తప్ప ప్రభుత్వం చలించదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -