Sunday, May 4, 2025
- Advertisement -

పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తు ఉందా ? ఇలా అయితే లీడర్ గా ఎదగడం కష్టం

- Advertisement -
pawan kalyan sensational tweets

తెలుగు రాష్ట్రాలలో క్లారిటీ లేని నాయకుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు – పవన్ కళ్యాణ్ .. క్లారిటీ అతనికి ఉంటుంది ఏమో కానీ ఆ విషయం జనాలకి మాత్రం చెప్పడం లో కళ్యాణ్ ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. పెద్ద పెద్ద మీట్ లలు పెట్టి జనాలతో ఇంటరాక్ట్ అవుతాడు కానీ అతను చెప్పాలనుకున్నదాన్ని స్పష్టంగా చెప్పడం లో కళ్యాణ్ ఓడిపోతూనే ఉన్నాడు . కొద్దికాలం క్రితం దుమారం రేపిన గోవధ హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఇటీవల చేసిన నోట్ల రద్దు దేశభక్తి ఏపీకి ప్రత్యేకహోదా అనే ఐదు అంశాలపై తాను గళం విప్పనున్నట్లు ప్రకటించారు.

ఈ అంశాలపై అన్నివర్గాల విజ్ఞుల అభిప్రాయాలను తాను సేకరించినట్టు పవన్ వెల్లడించారు. ముందుగా మొదటి పాయింట్ అయిన  గోవధ అంశాన్ని తీసుకుని బీజేపీ నేతలపై పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. గోరక్షణ కోసం ఎన్నో మాటలు చెప్తున్న బీజేపీ నేతలు- కార్యకర్తలు ఆవులను ఎందుకు దత్తత తీసుకోవడంలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

గో చర్మంతో తయారు చేసిన తోలు బెల్టులు చెప్పులను బీజేపీ నేతలు కార్యకర్తలు ధరించకుండా ఎందుకు నిషేధించలేదని నిలదీశారు. అంతా బానే ఉంది కానీ సడన్ గా ఆవిషయాల గురించి కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నాడు ? సడన్ గా బీజేపీ కి ఎందుకు రివర్స్ అయ్యాడు ? ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ని ఒక్క మాట కూడా ఎందుకు అడగడు ? అంటూ కళ్యాణ్ ఫాన్స్ స్వయంగా కళ్యాణ్ మీద కోప్పడుతున్నారు. ఈ రకంగా క్లారిటీ లేని స్టార్ పొలిటికల్ లీడర్ గా తయారు అయితే అతనికి భవిష్యత్తు ఉండదు అనే అంటున్నారు విశ్లేషకులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -