- Advertisement -
జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్ మరోసారి స్పందించాడు.. రాజధాని భూసమీకరణం పైన మరో సారి ట్వీట్ చేశాడు..
మూడు పంటలు పండే రైతుల భూములను లాక్కోవద్దని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజధాని భూముల సేకరణపై పవన్‌కల్యాణ్ మరో సారి ట్విట్టర్లో స్పందించారు. మరోసారి చంద్రబాబు ఆలోచించాలని కోరారు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడితోపాటు నదికి సమీపంలో ఉన్న గ్రామాలను భూసేకరణ నుంచి మినహాయించాలని పవన్ కోరారు. పాలకులు రైతుల పట్ల వివేచనతో మెలగాలని కోరారు. అభివృద్ధి కోసం జరిగే నష్టం ఎంత కనిష్టమైతే ఆ పాలకులు అంత వివేకవంతులని ఆయన వ్యాఖ్యానించారు.
వాతావరణ సమతుల్యత, పర్యావరణాన్ని కాపాడాలని పవన్ కోరారు.
మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..