Thursday, May 8, 2025
- Advertisement -

తెలుగు కీర్తిని పొగిడిన పోలాండ్ బుడ్డోడు

- Advertisement -
  • ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు శుభాకాంక్ష‌లు

తెలుగు కీర్తిని దేశ‌, విదేశాల్లో చాటేలా తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తుండ‌గా దీనికి ఓ పోలాండ్ బుడ్డోడు మ‌ద్ద‌తు ప‌లికాడు. స్వాగ‌తం సుస్వాగ‌తం అంటూ బుల్లిబుల్లి ప‌లుకుల‌తో తెలుగు మ‌హాస‌భ‌ల‌కు స్వాగ‌తం ప‌లికాడు. ఇటాలియ‌న్ ఆఫ్ ద ఈస్ట్‌గా పేర్కొన్న భాష తెలుగు అని గుర్తుచేశాడు. ఈ సంద‌ర్భంగా తెలుగ‌దేలా అన్న అనే ప‌ద్యం శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల ప‌ద్యం అందుకున్నాడు. అంద‌రికీ న‌మ‌స్కార‌ములు అని వంద‌నం చేస్తూ మంచి స్వ‌రంతో ల‌య‌బ‌ద్ధంగా ఆ ప‌ద్యాన్ని పాడి తెలుగు భాష‌పై అభిమానం చూపించాడు.

ఈ సంద‌ర్భంగా మ‌రో మా తెలుగుత‌ల్లి అనే గేయం పాడాడు. ఈ గేయం పాడుతుండ‌గా ఆ బుడ్డోడు వెన‌కాల తెలంగాణ‌, తెలుగుభాష‌కు సంబంధించిన చిత్రాలు వెళ్తూ క‌నిపిస్తున్నాయి. ఈ బుడ్డోడు తెలుగు భ‌క్తికి మెచ్చి అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. తెలుగు మ‌రచిపోతున్న తెలుగు ప్ర‌జ‌లు ఉండ‌గా ఎక్క‌డో విదేశంలో తెలుగును అభిమానిస్తూ తెలుగును చ‌క్క‌గా మాట్లాడిన అబ్బాయిను అంద‌రూ మెచ్చుకుంటున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -