Wednesday, May 7, 2025
- Advertisement -

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం బిగ్‌షాక్‌..

- Advertisement -

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం మ‌రో షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే పోల‌వ‌రం ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్న త‌రుణంలో మోదీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం బాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. 2019 క‌ల్లా పోల‌వ‌రాన్ని పూర్తిచేసి ఎన్నిక‌ల‌కు వెల్ధామ‌నుకున్న క‌ల‌కు కేంద్రం అడ్డుక‌ట్ట‌వేసింది. ప్రాజెక్టు అంచ‌నాల‌పెంపు, డిజైన్ల‌ల‌లో మార్పు చేసి ఆమోదించాల‌ని కేంద్రానికి పంపింది రాష్ట్ర‌జ‌ల‌వ‌ణ‌రుల శాఖ‌.

ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, అంచనాల ఆమోదంలో ముందడుగు పడకపోగా తాజాగా ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టు డిజైన్లను సైతం కేంద్రం ఆమోదించలేదని తెలుస్తోంది. రాష్ట్ర జలవనరుల శాఖ పంపించిన డిజైన్లను ఆమోదించని సీడబ్ల్యూసీ విభాగం అధికారులు తామే క్షేత్రస్థాయిలో పర్యటించి డిజైన్లను పరిశీలిస్తాం అని ఏపీ ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం.

ప్రాజెక్ట్ అంచనాల ఆమోదంలో జాప్యం జరిగినట్టయితే, ఆ వెంటనే రూ. 10వేల కోట్లు మంజూరు చేయాలని, కాపర్ డ్యామ్, స్పిల్ చానల్ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన డిజైన్లను ఆమోదించాల్సిందిగా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన అభ్యర్థనను తోసి పుచ్చింది కేంద్ర జ‌ల‌వ‌ణ‌రుల శాఖ‌.

పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తికి సీడబ్ల్యూసీ ఆమోదిస్తే కానీ నిధులు విడుదల కావు. నిధులు విడుదల కానిదే ప్రాజెక్టు పనులు ముందుకు సాగవు. పోల‌వ‌రం ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయిని ఒక వైపు బాబు గొప్ప‌లు చెప్ప‌కుంటున్నారు. వాస్త‌వంగా చూస్తే కేంద్రం నిధులు ఇస్తే గాని పోల‌వ‌రం ప‌నులు ముందుకు సాగ‌వు. పోల‌వ‌రం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని 2019 ఎన్నిక‌ల్లో మ‌రో సారి అధికారంలోకి రావాల‌న్న బాబు క‌ళ మాత్రం నెర‌వేరే ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -