Sunday, April 28, 2024
- Advertisement -

పోలవరానికి బాబు చెసిన కుట్ర ఇదే

- Advertisement -

గోదావరి నది 2.1 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహిస్తుంటుంది. నదికి అటువైపున స్పిల్‌ వే కట్టాలి. ఆ స్పిల్‌ వే పూర్తిచేసి నీరు డైవర్ట్‌ చేసి కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించాలి. కాఫర్‌ డ్యామ్‌ టెంప్రరరీ స్ట్రక్చర్‌. అది మెయిన్‌ డ్యామ్‌ కట్టానికి ఉపయోపడుతుంది. కాఫర్‌ డ్యామ్‌ స్పిల్‌ వే పనులు, అప్రోచ్‌ ఛానల్‌ పూర్తిచేసి నీరు డైవర్ట్‌ చేసే వెసులుబాటు కల్పించిన తరువాత కాఫర్‌ డ్యామ్‌ కట్టాలి. తరువాత మెయిన్‌ డ్యామ్‌ కట్టాలి. మెయిన్‌ డ్యామ్‌ మధ్యలో ఉంచి కాఫర్‌ డ్యామ్‌ 2 కట్టాలి. ఇవన్నీ కట్టకముందే స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానల్‌ పూర్తిచేయాలి.

అలాంటిది చంద్రబాబుకు ఏం తెలివితేటలు ఉన్నాయో తెలియదు.. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు.. ఒకవైపున స్పిల్‌ కంప్లీట్‌ కాకుండా.. అప్రోచ్‌ఛానల్‌ కంప్లీట్‌ కాకుండా.. 2.1కిలోమీటర్ల గోదావరి విస్తీర్ణానికి అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ కట్టి.. దానికి రెండుగ్యాప్‌లు విడిచిపెట్టారు. లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌లో కూడా రెండు గ్యాప్‌లు విడిచిపెట్టారు. నీరు స్పీల్‌ వే పైనుంచి వెళ్లలేక, గ్యాప్‌ల గుండా వెళ్లాల్సివచ్చేసరికి ఉధృతి పెరిగి డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నది. దీనికి కారణం ఎవరు అని అడిగితే సామాన్య వ్యక్తి కూడా ఏ ముఖ్యమంత్రి చేసింది ఈ వెదవ పని అని చెప్తారు.

అప్రోచ్‌ ఛానల్‌కు సంబంధించి చంద్రబాబు హయాంలో జూన్‌ 2019లో ఇలా బీడుబీడుగా ఉన్న భూమి.. ఏకంగా అప్రోచ్‌ ఛానల్‌ తయారు చేసి నీళ్లను డైవర్ట్‌ చేసే కార్యక్రమం ఈరోజు కనిపిస్తుంది. చంద్రబాబు 2018లో స్పిల్‌ వే పనులు ఏమాత్రం కూడా పూర్తికాకుండా పునాదులు వేసి.. ఏకంగా ఆయన వ‌చ్చి స్పీల్‌ వే పూర్తికాకుండానే అయిపోయినట్టుగా ప్రచారం చేశారు.
మెయిన్‌ డ్యామ్‌లో కూడా గ్యాప్స్‌ పెట్టారు.

దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 680 మీటర్ల గ్యాప్‌. మరోవైపు 120 మీటర్ల గ్యాప్‌ పెట్టారు. చంద్రబాబు వరదను మళ్లించే పనులు పూర్తి చేయకుండా.. 2018లో గ్యాప్‌ 2లో 1,396 మీటర్ల పొడవునా డయా ఫ్రమ్ వాల్ నిర్మించిన వైనం. 2019లో వచ్చిన భారీ వరదలకు కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్. నీరంతా ఈ గ్యాప్‌ల నుంచి వెళ్లే పరిస్థితి వల్ల డయాఫ్రం వాల్‌ పూర్తిగా కింద నుంచి దెబ్బతిన్నది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడంతో పోలవరం ప్రాజెక్టుకు వేలకోట్లలో నష్టం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -