లైంగిక వేధింపులు, పెళ్లి పేరుతో మోసం మరియు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారన్న తీవ్రమైన ఆరోపణలపై బిఆర్‌ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 26న ఆయనపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
బాధితురాలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు.ఇంటర్వ్యూ సాకుతో తనను ఒక ఫ్లాట్‌కు పిలిపించుకుని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది.ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా లొంగదీసుకుని వాడుకున్నారని ఫిర్యాదులో తెలిపారు.
తనకు తెలియకుండానే తన ప్రైవేట్ క్షణాలకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడతానని చెప్పి తన వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నారని తెలిపారు. తన ఫోన్‌ను తన అనుమతి లేకుండా యాక్సెస్ చేసి, తన స్నేహితురాలికి కూడా అదే రీతిలో మెసేజ్‌లు పంపి ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించారు.
బాధిత యువతి ఇచ్చిన సుదీర్ఘమైన ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు రేగా కాంతారావుపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కీలక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.BNS సెక్షన్ 69 (పెళ్లి పేరుతో మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకోవడం),BNS సెక్షన్ 351 (2) (నేరపూరిత బెదిరింపులు),బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
