- Advertisement -
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకు మావోయిస్టులు ప్రణాళికలు రూపొందించారనే వార్త సంచలనం సృష్టిస్తుంది.ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షోలను టార్గెట్ చేసి హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.మావోయిస్టుల కుట్రను పుణే పోలీసులు ఆదిలోనే భగ్నం చేశారు. మాజీ భారత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే మోదీని చంపేయాలని మావోలు కుట్ర పన్నారని తెలుస్తోంది.
దీనికి సంబంధించిన ఓ లేఖను పోలీసుల జరిపిన తనిఖీల్లో కనుగొన్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధం ఉన్న రోనా విల్సన్ ఇంట్లో ఈ లేఖను కనుగొన్నామని పుణే పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.మోదీ మళ్లీ ప్రధాని అయితే తమకు ఇబ్బందులు తప్పవని,సాధ్యమైనంత త్వరగా మోదీని హత్య చేయలని ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.