తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేసారు . ఆయన మాట తీరులో చాలా రోజుల తరవాత వెటకారం కనపడింది. ఎంతో ముచ్చటపడి కట్టుకున్న సీఎం పెద్ద క్యాంపు ఆఫీస్ ను – ఎర్రవల్లిలోని ఆయన ఫాం హౌజ్ ను వెంటనే పర్యాటక కేంద్రాలుగా గుర్తించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.
ఈమేరకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ పేర్వారం రాములుకు పొన్నం లేఖ రాశారు. తాను ఎందుకు ఈ విధమైన డిమాండ్ పెట్టాననే ఆసక్తికి పొన్నం ప్రభాకర్ అనూహ్యమైన లాజిక్ ను వెల్లడించారు.” సీఎం కేసీఆర్ టూరిజం చైర్మెన్ పదవి మీకు ఇస్తూ…ఆ పదవికి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలను టూరిజం చైర్మెన్ గా బాగా అభివృద్ధి చేస్తున్నట్టు పేపర్లో చదివాను. నిజమెంతో తెలియదు ఈ క్రమంలో మా సూచన ఒకటి.
రాజైతే ఉన్న భవంతులు వాస్తు ప్రకారం బాగలేకపోతే కూలగొట్టి మల్ల తనకు నచ్చినట్టు కట్టుకుంటడు. అందుకే తమ రాజు కేసీఆర్ కట్టించిన పెద్ద క్యాంప్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు. నయా రాజు తొమ్మిదెకరాల్లో 500 కోట్లతో ఆధునిక హంగులు – సౌకర్యాలతో కట్టుకున్న రాజభవంతి ఎట్లున్నదో చూసి మురిసి పోవాలని అంతా అనుకుంటున్నారు. ” అన్నారు ఆయన.