- Advertisement -

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఇదేనా?

- Advertisement -

‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న ప్రభాస్, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ పీరియాడిక్ వార్ డ్రామా విడుదల తేదీపై తాజాగా ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ఫౌజీ’ చిత్రంపై ప్రేక్షకుల్లో ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ‘సీతారామం’ వంటి క్లాసిక్ అందించిన హను రాఘవపూడి, స్వాతంత్ర్యానికి ముందు జరిగిన నేపథ్యంలో ఈ కథను సిద్ధం చేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఆగస్టులోనే విడుదలవుతుందని భావించినప్పటికీ, షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా అక్టోబర్ లేదా నవంబర్‌కు వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘సలార్’, ‘పుష్ప’, ‘అఖండ’ వంటి భారీ చిత్రాలు డిసెంబర్ నెలలోనే విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్నాయి. అదే సెంటిమెంట్‌ను ‘ఫౌజీ’ కూడా కొనసాగిస్తుందేమోనని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ సినిమా నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ చిత్ర బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఫీజులు, ప్రమోషన్లతో కలిపి ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 600 కోట్లుగా అంచనా వేస్తున్నారు. సినిమాలోని సన్నివేశాల కోసం ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ మాయ నేతృత్వంలో దాదాపు రూ. 200 కోట్లతో 10 భారీ సెట్‌లను నిర్మించారు.

‘ఫౌజీ’ చిత్రం బిజినెస్ పరంగా కూడా ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా సౌత్ లాంగ్వేజ్ ఓటిటి హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 180 కోట్లకు దక్కించుకోగా, హిందీ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఏఏ ఫిలింస్’ రూ. 63 కోట్లకు సొంతం చేసుకుంది. హిందీ ఓటిటి హక్కులకు సంబంధించిన ఒప్పందం ఇంకా ఖరారు కావాల్సి ఉంది. దీనిపై త్వరలోనే చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -