ఏపీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎన్నికల ప్రచారంలో సింహం సింగిల్‌గా వస్తుందనేలా జగన్ ప్రచారం సాగింది. ఇక కూటమి తరపున టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ప్రచారం చేశారు. ఇక ప్రచారపర్వంలో మాటల యుద్దం తారాస్థాయికి చేరగా ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ఇక ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రీ పోల్ సర్వేలో ఫ్యాన్ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. రెండోసారి వైసీపీ విజయం సాధించడం ఖాయమని ప్రీ పోల్ సర్వేలన్ని తేల్చేశాయి. RACE అనే సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో వైసీపీ 123 – 128 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని, కూటమి 47-52 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది.
సీఎంగా జగనన్న పనితీరుపై 55.10% మంది సంతృప్తి వ్యక్తం చేశారని, మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలంటూ 61.20% మంది తెలిపారని చెప్పుకొచ్చింది. ఇక అధికారంలోకి వచ్చేందుకు సాధ్యంకాని హామీలిచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు ఏమాత్రం నమ్మలేదని చెప్పుకొచ్చింది.