- Advertisement -

రాజమౌళిని సత్కరించిన కేసిఆర్..!

- Advertisement -

ఇది  స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాదండోయ్..! ఆయన సినిమా కోసం కష్టపడితే, ఈ రాజమౌళి తన ఊరి కోసం కష్టపడి ఈ స్థాయికి చేరాడు.

ఈయన గ్రామానికి చేసిన అభివృద్దిని గమనించి సిఎం కేసిఆర్ ఆయనకు సన్మానం చేశారు.

వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళిని ముఖ్యమంత్రి కేసిఆర్ సన్మానించి అభినందించారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యాక్రమానికి కేసిఆర్ హాజరై రాజమౌళిని సత్కరించారు. రాజమౌలి గంగదేవి పల్లిని ఆదర్శంగా తీర్చిదిద్ది, అభివృద్ది చేశాడని ఆయకు ఈ గౌరవం దక్కింది. అలాగే గ్రామాల్లో గుడుంబాను అరికట్టాలని, మురికినీటి నిల్వలను లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి ప్రజల భాగస్వామ్యంతో జరిగిన అభివృద్ధిని వివరించారు.

2007 లో ఈ గ్రామానికి జాతీయ స్థాయిలో బెస్ట్‌ గ్రామ పంచాయతి అవార్డ్ రావడం విశేషం.

100% అక్షరాస్యత, 100% మధ్య నిషేధం, ఇంటింటికి 100% పారిశుద్య సదుపాయం, గ్రామంలో 100% కుటుంబాలలో కుటుంబ నియంత్రణ ఆ గ్రామం సాధించిన ప్రగతి సూచికలు. స్వయంకృషి, సామూహిక ప్రయత్నం ద్వారా సమస్యలను అధిగమించవచ్చునని, గ్రామాన్ని సుందరంగా తీర్చి దిద్దుకోవచ్చునని ఈ గ్రామస్తులు నిరూపించారు. వూరిలో ప్రవేశించగానే ఇరువైపులా కనిపించే బోర్డులు వారి క్రమశిక్షణను, కట్టుబాటును చాటి చెబుతాయి.

 ఇప్పటికే ఈ రాజమౌళికి ఇలాంటి సన్మానాలు, అవార్డ్స్‌ చాలా వచ్చాయి. సినిమా ఫీల్డ్‌లో డైరెక్టర్ రాజమౌళి టాప్ పొజిషన్‌‍లో కొనసాగుతుంటే… ఇక్కడ ఈ రాజమౌళి, ఈ ఫీల్డ్‌లో అవార్డ్స్‌ సాధిస్తున్నారు. ఎవరి గొప్పదనం వారిది.      

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -