దేశంలో నల్లధనాన్ని అరికట్టాలనే ప్రధాన ఉద్దేశ్యంతో 2016 నవంబర్ మాసంలో ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయం తరువాత ఆర్బీఐ రూ.2000 నోటును మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వచ్చాయి. నల్ల ధనాన్ని అరికట్టాలను కున్నప్పుడు పెద్ద నోట్లు ఎదుకు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించాయి. తాజాగా రూ.2000 నోటు ముద్రణ విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ముద్రణను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది.
నోట్ల ముద్రణను నిలిపి వేసినా ప్రస్తుతం ఉన్న నోట్లు చలామణిలో ఉంటాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 2018 మార్చి నాటికి 18.03 ట్రిలియన్ల రెండు వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.6.78 ట్రిలియన్లుగా ఉన్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.7.73 ట్రిలియన్ల రూ.500 నోట్లు ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్నాయని తెలిపింది.
