వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ కు చెందిన సాక్షి పత్రికను తెలుగుదేశం పార్టీ నేతలు తరచు విమర్శిస్తుంటారు.తాజాగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతే విమర్శించడం విశేషం. అయితే ఆ పత్రికవల్లే తమ కొంప మునిగిందని ఆయన అంటున్నారు.
‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానల్ వల్లే జగన్ ముఖ్యమంత్రి కాలేకపోయారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మీడియాలో ప్రదర్శించిన అతి విశ్వాసం కారణంగానే అధికారంలోకి రాలేకపోయారన్నారు. ఎన్నికల సమయంలో సాక్షి పత్రిక ప్రచురణలు, చానల్ ప్రసారాలు జగన్‌తో పాటు తమ పార్టీలో అతి విశ్వాసాన్ని కల్పించాయని ఆయన వాపోయారు.