Wednesday, May 8, 2024
- Advertisement -

కాకినాడలో 2500 కోట్లతో జీఎంఆర్ ఓడరేవు

- Advertisement -

పోర్టు నిర్మాణ రంగంలోకి తొలిసారి జీఎంఆర్ సంస్థ అడుగుపెడుతోంది. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కేసెజ్) బ్యాక్ యార్డ్ లో భారీ పోర్టు నిర్మాణానికి జీఎంఆర్ ప్రాథమిక అధ్యయనం పూర్తి చేసింది. ఆధునికి గ్రీన్ ఫీల్డ్ పోర్టును డెవలప్ చేయడానికి జీఎంఆర్ సిద్దమవుతున్నట్టు తెలిసింది.

కార్గో, కంటైనర్ కార్డో, ఎగుమతి, దిగుమతి ఆపరేషన్ల లాంటి సదుపాయాలు కల్పించే విధంగా జీఎంఆర్ ప్రణాళికను సిద్దం చేసుకున్నట్టు సమాచారం. కాకినాడ సెజ్ కు కెటాయించిన 10,500 ఎకరాల్లో పోర్టు కోసం 2100 ఎకరాలను ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది.  

పోర్ట్ నిర్మాణ ప్రాజెక్ట్ వ్యయం 2500 కోట్లుగా అంచనా వేస్తున్నారు. తూర్పు తీరంలో అతిపెద్ద, అధునిక కార్గో హబ్ గా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో జీఎంఆర్ సిద్దమైంది. ఆరునెలల్లో పబ్లిక్ హియరింగ్ కు వెళ్తామని.. ఆతర్వాత మూడేళ్లలో ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని జీఎంఆర్ అధికారులు తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -