Monday, May 12, 2025
- Advertisement -

అక్కడ ఒప్పు.. ఇక్కడ తప్పా?

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో టీడీఎల్పీ నాయకుడు రేవంత్ రెడ్డి.. ఓ డిబేట్ పాయింట్ అవుతున్నారు. తప్పని పరిస్థితుల్లో.. టీడీఎల్పీ నాయకుడి బాధ్యతలు తీసుకున్న రేవంత్.. మామూలుగానే కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పెద్ద పెద్ద మాటలు కూడా చెబుతున్నారు. అయితే.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న రాజకీయం ఏంటని.. కొందరు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

అక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీడీపీలో చేర్చుకోవడం లేదా అని అడుగుతున్నారు. అక్కడ అలాంటి రాజకీయం సరైనదే అయినపుడు.. ఇక్కడ మాత్రం ఎలా తప్పవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ను రేవంత్ విమర్శిస్తే.. చంద్రబాబును కూడా పరోక్షంగా విమర్శించినట్టే అని స్పష్టం చేస్తున్నారు.

కాస్త గమనిస్తే.. ఈ వాదనలో కూడా నిజం ఉందనే అనిపిస్తుంది. అయితే.. పార్టీల ఫిరాయింపుల విషయం రాజకీయ నేతల నైతికతకు సంబంధించింది. ఇందులో మంచి చెడు ఏంటన్నది పక్కన పెడితే.. అక్కడ చంద్రబాబు చేస్తున్నదే.. ఇక్కడ కేసీఆర్ చేశారు కదా.. అలాంటపుడు రేవంత్ అంత సీరియస్ కావాల్సిన అవసరం లేదన్న వాదన కూడా కరెక్టే అనిపిస్తోంది. దీనికి.. టీడీఎల్పీ కొత్త నాయకుడు ఎలా బదులు చెబుతారో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -