- Advertisement -
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ లో జరిగిన టిడిపి కార్యకర్తల సమావేశానికి హాజరైన రేవంత్.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోవటం లేదన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు 70 శాతం టికెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ .. వాటిని విస్మరించారని చెప్పారు. తన మంత్రివర్గంలో ఏ ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ అవమానించారని ఆరోపించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా 8 స్థానాల్లో టిడిపి విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.