Monday, May 20, 2024
- Advertisement -

శశికళ ముఖ్యమంత్రి అయిపోయినట్ట్టే

- Advertisement -
Sasikala may take charge as Tamil Nadu CM on January

జయలలిత నెచ్చెలి శశికళ పార్టీలో తన బలం పెంచుకునే పనిలో చాలా కష్టపడుతున్నారు. ప్రధాన కార్యదర్శి గ పదవీ బాధ్యతలు చేపట్టిన తరవాత ఇప్పటి వరకూ ఆమె సీఎం కావాలి అంటూ ఎన్నో డిమాండ్ లు వినపడ్డాయి.

ఇప్పుడు అదే కోవలో జయలలిత కుటుంబ సభ్యులు వచ్చి చేరుతున్నారు. జయలలిత సోదరుడు జయకుమార్ కుమారుడు దీపక్ మీడియాతో మాట్లాడుతూ శశికళ అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు స్వీకరించి తమ మేనత్త జయలలిత ఆశయాలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అదే రీతిలో సీఎం పగ్గాలు కూడా స్వీకరించాలని కోరారు. ఈ మేరకు త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారని కూడా ప్రకటించారు. 

జయలలిత అంత్యక్రియల సమయం నుంచి శశికళతో వైపు మొగ్గు చూపిన దీపక్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ త్వరలో తమ మేనత్త జయలలిత వారసురాలిగా శశికళ ఆంటీ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని ప్రకటించారు. ఇది కేవలం తన డిమాండ్ మాత్రమే కాదని అన్నాడీఎంకే నాయకులు సైతం తమ మేనత్త స్థానంలో చిన్నమ్మ బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారని దీపక్ వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా దీపక్ వ్యాఖ్యలపై శశికళ ప్రత్యర్థి వర్గం స్పందించింది. దీపక్ మాటలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని వారు పేర్కొన్నారు. కాగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మేనత్త వారసురాలిగా శశికళ అరంగేట్రాన్ని సహించలేని సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళకు అప్పగించరాదని సీఎం కుర్చిలో కుర్చోపెట్టరాదని  డిమాండ్ చేసిన క్రమంలో తాజాగా దీపక్ ఎంట్రీతో పాటు చిన్నమ్మ సీఎం కావాలనే డిమాండ్ చేయడం కలకలం రేకెత్తిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -