Wednesday, May 7, 2025
- Advertisement -

పరిటాల సునీత.. పార్టీ ఇమేజ్ ను అలా డ్యామేజ్ చేసింది!

- Advertisement -

ఒకవైపు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తను శాంతి ప్రదాతను అని చెప్పుకొంటూ ఉంటారు. వైఎస్ ఫ్యాక్షనిస్టు అని.. జగన్ కూడా ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తేనని…

వారు అధికారంలో ఉంటే హత్యలు జరుగుతాయని.. అందుకే అధికారాన్ని తనకు అప్పగించాలని అప్పట్లో బాబు తెగ చెప్పే వారు. అయితే తీరా బాబు అధికారంలోకి వచ్చాకా కూడా రాయలసీమలో రక్తపాతం కొనసాగుతోంది.

మరి ఈ రక్తపాతంతో తమకు ఏమీ సంబంధం లేదనేది తెలుగుదేశం నేతల వాదన. అయితే ఇలా వాదిస్తూనే.. వారు తమ తీరుతో ఈ హత్యకేసుల్లో తమ ఇన్ వాల్వ్ మెంట్ ను రుజువు చేసుకొంటున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో పోలీసులు అధికారులు రాప్తాడు ఎస్ఐ, ఇటుకల పల్లి సీఐలను ప్రస్తుతానికి విధుల నుంచి తప్పించారు.

అయితే చాలా చర్య. మరి వారిపై అలాంటి వేటు పడే సరికి పరిటాల సునీత తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. పోలీసు అధికారులను తప్పించడాన్ని దృష్టిలో ఉంచుకొని.. తన భద్రతను ఆమె వెనక్కు పంపి.. ప్రభుత్వానికి నిరసన తెలిపింది. మరి ఇలాంటి నిరసనతో.. ఈ హత్య కేసులో తమ ఇన్ వాల్వ్ మెంట్ ను పరోక్షంగా రుజువు చేసుకొన్నారు మంత్రిగారు!

దీంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. హత్యతో సంబంధం లేకుండా ఉండుంటే.. సునీతలో ఇంత ఉలికిపాటు ఎందుకు? అని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సునీత పొరపాటును గ్రహించింది. తిరిగి సెక్యూరిటీని వెనక్కు పిలిపించుకొంది. తద్వారా జరిగిన డ్యామేజీని కవర్ చేసుకొనేందుకు ప్రయత్నించినట్టుగా ఉంది. మరి కవర్ అయినట్టేనా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -