Friday, May 17, 2024
- Advertisement -

ఈ సింగ‌ర్‌ను టార్చ‌ర్ పెట్టేవాడ‌ట‌..!

- Advertisement -

సీత కష్టాలు సీత‌వి పీత క‌ష్టాలు పీత‌వి అన్న‌ట్లు ఉంది. ఓ ప‌క్క ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌ల‌పై కాస్టింగ్ కౌచ్ పేరిట అనేక లైంగిక వేధింప‌లకు పాల్ప‌డుతున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. అవ‌కాశాల పేరిట మ‌హిళ‌ను లైంగికంగా వాడుకుంటురని చాలామంది మ‌హిళ న‌టీమ‌ణులు బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. అయితే ఈ వేధింపులు అనేది కేవ‌లం న‌టీమ‌ణులకే ప‌రిమితం కాలేదు. సింగర్‌ల‌ను సైతం ఈ బారిన ప‌డుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… టాలవుడ్ సింగ‌ర్స్‌లో మాళ‌విక కూడా ఒక‌రు. మ‌ళ‌విక తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో త‌న జీవితంలో ఎదురైనా ఓ సంఘ‌ట‌న‌ను అభిమానుల‌తో పంచుకుంది. ప్రేమిస్తున్నానంటూ ఒక అజ్ఞాతవాసి త‌నను టార్చ‌ర్ పెట్టేవాడ‌ట‌.

అత‌ను ఎవ‌రో కూడా నాకు తెలియ‌దు. కాని రోజూ ఫోన్ల మీద ఫోన్లు – ఎస్ ఎం ఎస్ లు చేసేవాడు. ఒక రోజు అత‌ని ఫోన్ నుంచి మెస్సేజ్ వచ్చింది. సౌందర్య బర్త్ డే.. డెత్ డే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బర్త్ డే.. డెత్ డే – ఇలా సెలబ్రిటీల పుట్టిన రోజులు చనిపోయిన రోజులు రాసి చివరకు మాళవిక బర్త్ డే,రాసి డెత్ డే అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. నాకు చాలా భయం వేసింది. దీంతో వెంట‌నే వేరే నెంబ‌ర్ నుంచి మా వాళ్ల చేత కాల్ చేయించి మాట్లాడించాను. డీఎస్పీని మాట్లాడుతున్నా , మాళవిక మీపై కేసు పెట్టారని కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంతే మళ్లీ అత‌ని నుంచి నాకు కాల్ రాలేద‌ని త‌న జీవితంలో జ‌రిగిన విచిత్ర సంఘ‌ట‌న‌ను ఈ ఇంట‌ర్య్వూలో చెప్పుకొచ్చింది మాళ‌విక‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -