పిల్లలు సరదాగా తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ సెల్ఫీ నేషనల్ లేవల్లో క్రేజ్ తెచ్చుకుంది. అంతలా క్రేజ్ రావడానికి ఆ సెల్ఫీలో ఏముందనే కదా మీ అనుమానం. ఉందండీ ..ఉంది కాబట్టే ఈ సెల్ఫీ సంచలనంగా మారింది. ఈ ఫోటోలో ఐదుగురు చిన్నారులు చిరునవ్వులు చిందిస్తూ ఉండగా.. వారిలో ఒక పిల్లాడు చెప్పు(స్లిప్పర్)తో సెల్ఫీ తీస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ ఫోటోపై పలువురు సెలబ్రిటీలు సైతం కామెంట్స్ చేయడం విశేషం.
బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ ఫోటోని షేర్ చేస్తు మీరు ఎంత సంతోషకంగా ఉన్నారో ఈ ఫోటోని చూస్తుంటే అర్థం అవుతోందని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తాజాగా ఈ ఫోటోపై బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ కూడా స్పందించారు. ఇది ఫొటోషాప్‌లో ఎడిట్ చేసిన ఫోటోలా నాకు అనిపిస్తోందని కామెంట్ చేశారు అమితాబ్. అయితే అమితాబ్ చేసిన కామెంట్‌పై చాలామంది ఏకీభవించడం లేదు. అది ఫొటో షాప్ చేసిన చిత్రం కాదని చాలామంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ ఫోటో మాత్రం సంచలనంగా మారింది. ఈ ఏటి మేటి సెల్ఫీ ఇదే అంటూ నెటిజన్లు కామెంట్ చేయడం విశేషం.
- Advertisement -
ఈ ఏటి మేటి సెల్ఫీ ఇదేనేమో..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -