సిగరేట్..లిక్కర్ రెండు హానికరమే కానీ మన గుండెకు ఏది ఎక్కువ ప్రమాదకరం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దేశంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది మన దేశంలోనే గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే గుండె జబ్బులు రావడానికి కారణాలు ఎన్ని ఉన్నా ప్రధానంగా సిగరేట్, లిక్కర్ గుండెకు హానికరమని అందరికి తెలుసు.
అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ డేంజర్ అనేది చాలా మందికి తెలియదు. ఒక వ్యక్తి ప్రతిరోజూ మూడు లేదా అంతకంటే ఎక్కువ డ్రింక్స్ తాగుతూ, అదే స్థాయిలో సిగరెట్లు కూడా తాగితే అది గుండెకు చాలా హానికరం కావచ్చు. ఎందుకంటే సిగరెట్ తాగడం వల్ల గుండె ధమనులు మూసుకుపోయే ప్రమాదం, గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది.
ఇక మద్యం తాగడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. గుండెకు మద్యం కంటే సిగరెట్ చాలా ప్రమాదకరం. రోజుకు రెండు సిగరెట్లు తాగినా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇక ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి సిగరెట్ చాలా ప్రమాదకరం. అలాంటి వ్యక్తులు రోజుకు ఒక్క సిగరెట్ కూడా తాగకూడదు. ఎందుకంటే ఇది భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుంది. ఏదిఏమైనా ఆరోగ్యం శ్రద్ధపెట్టి డాక్టర్ల సూచనతో మన లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకుని ముందుకు సాగితే ఎలాంటి సమస్యలు ఉండవని చాలామంది చెబుతున్నారు.