సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు టీడీపీ సోషల్ మీడియా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోంది. అసెంబ్లీలో అయితే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావాలనే జగన్ జైల్ కెళ్ళిన సంగతి ఎత్తి బాగా కెలికారు. తెలుగు దేశం విపక్షంలోకి వైసీపీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు మరో కొత్త కథ మొదలు పెట్టారు.
జగన్ బాలయ్యబాబు ఫ్యాన్ అన్నది ఆ కధ. దీనికి ఇదిగో సాక్ష్యం అంటూ ఒక ఫేక్ పిక్ ని కూడా బయటపెట్టారు. బాలకృష్ణ ‘సమర సింహా రెడ్డి’ సినిమా విడుదలై ఏడాది కావొస్తున్న తరుణంలో ఇప్పటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి.. బాలయ్య కడప జిల్లా అధ్యక్షులుగా ఉన్నటు వంటి ఫోటోను సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. అందులో 2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పేపర్ ప్రకటన ఉంది. అయితే పచ్చ బ్యాచ్ అక్కడే పప్పులో కాలేసింది.
అందులో వాడిన బాలకృష్ణ స్టిల్ అయితే సమర సింహారెడ్డిదే వాడారు కానీ – జగన్ మోహన్ రెడ్డి ఫొటోనే కొంచెం లేటెస్టుది వాడారు. వాస్తానికి ఆ ఫొటోలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే లేరు. ఆ అసలు పిక్ లో భార్య భారతి కూడా ఉంటారు.జగన్ కు పెళ్లయ్యాకా – ఏ పదిహేనేళ్ల కిందటో తీయించుకున్న ఫొటోలోగా ఉండగా – దాన్ని కట్ చేసి – ఎడిట్ చేసి – పేపర్లో అచ్చు అయినట్టుగా పేస్ట్ చేశారు దీంతోనే ఇపుడు వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.

వై.యస్.జగన్మోహన్ రెడ్డి 2003లో తన భార్యతో ఒక గార్డెన్లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అంతేకాదు అసలు వై.యస్.జగన్మోహన్ రెడ్డి అసలు ఏ హీరోకు కూడా అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉండలేదు. ఆయన ఏ కథానాయకుడిని నెత్తిన పెట్టుకొని ఊరేగలేదు అంటూ సదరు టీడీపీ శ్రేణులు సర్కులేట్ చేస్తున్న ఫోటోకు కౌంటర్‌గా మరో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. మరి రెండు వర్గాలు వారు చేస్తున్న ఈ ప్రచారంలో ఎవరు నిజం చెబుతున్నారు. ఎవరు ఫాల్స్ ప్రచారం చేస్తున్నారనే విషయంలో క్లారిటీ రావాలంటే జగన్, బాలయ్య ఇద్దరిట్లో ఎవరో ఒకరు స్పందిచాల్సిందే అంటున్నారు.
