తెర పైన ఎలా కనిపించినా తెరవెనుక మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సౌమ్యుడు. చాలా మంది తెలుగు హీరోల్లాగా ఆవేశం, ఆగ్రహం ప్రదర్శించడాలు పెద్దగా చేయడు. అలాగే ఎప్పుడూ సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఫస్ట్ టైం మహేష్ బాబు అన్నింటికీ తెగించేశాడు. తన సూపర్ స్టార్ ఢంని ఫణంగా పెట్టేసి మరీ భరత్ అను నేను ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు.
సాధారణంగా మన హీరోలు ఎవ్వరూ కూడా సినిమా రిలీజ్‌కి ముందు ….. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పి తమ మాటగా ఎప్పుడూ చెప్పరు. ఎందుకంటే పొరపాటున సినిమా ఫలితం తేడా కొడితే ఆ తర్వాత సినిమాకు సదరు స్టార్ హీరో ఇంకేం చెప్పినా కూడా జనాలు నమ్మరు. అన్నింటికీ మించి సినిమాను కొన్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ దృష్టిలో స్టార్ ఢం వ్యాల్యూ పడిపోతుంది. అందుకే డైరెక్టర్‌తో సహా అందరిచేతా బ్లాక్ బస్టర్ అని చెప్పిస్తారు……. సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ అంటున్నారని హీరో చాలా జాగ్రత్తగా చెప్తాడు.
అలాగే సినిమాలో ఉన్న హైలైట్ ఎపిసోడ్స్ గురించి మాత్రమే చెప్తాడు. సినిమాను చూసినవాళ్ళందరూ మెచ్చుకుంటున్నారని కూడా చెప్తూ ఉంటారు మన హీరోలు. అయితే ఏ ఒక్క స్టార్ హీరో కూడా అర్జున్‌రెడ్డి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో విజయ్ దేవరకొండ చెప్పినట్టుగా…..ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం……ఇది నా మాట అనే స్థాయిలో చెప్పరు. అయితే మహేష్ బాబు మాత్రం భరత్ అను నేను సినిమా కోసం అన్ని పరిధులూ బ్రేక్ చేశాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ నేపథ్యంలో ఎలా అయినా భరత్ అను నేను సినిమాకు సూపర్ బజ్ తీసుకురావాలనుకున్న మహేష్ తన స్టార్ ఢంని ఫణంగా పెట్టి మరీ భరత్ అను నేను కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని తన మాటగా చెప్తూ ఉన్నాడు. మహేష్ మాట నిజమయ్యి సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే మాత్రం అందరూ మహేష్‌ని వేనోళ్ళ ప్రశంశిస్తారు. అలా కాకుండా రిజల్ట్ ఏ మాత్రం తేడా వచ్చినా మహేష్ బాబు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. తన తర్వాత సినిమాలను ప్రమోట్ చేయడానికి ఇక మహేష్ బాబు ఏం చెప్పినా సినిమా జనాలతో పాటు, ప్రేక్షకులు కూడా నమ్మరని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.