Friday, May 17, 2024
- Advertisement -

మ‌రో వివాదంలో ఇరుక్కున్న హీరో సూర్య తండ్రి

- Advertisement -

త‌మిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగ‌తి తెలిసిందే. సూర్య న‌టించిన ప్ర‌తి సినిమా తెలుగులో కూడా విడుద‌ల అవుతుంటాయి. సూర్య‌ను ఎప్పుడు చూసిన చాలా ప్ర‌శాంతంగా క‌నిపిస్తుంటాడు. మ‌రి అలాంటి హీరో తండ్రి అంటే ఎలా ఉండాలి , అంత‌క‌న్నా ప్ర‌శాంతంగా ఉండాలి. కాని సూర్య తండ్రి శివ‌కుమార్ మాత్రం ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇర‌క్కుంటు సూర్య‌కు చెడ్డ పేరు తీసుకువ‌స్తున్నాడు.

సూర్య తండ్రి శివ‌కుమార్ త‌మిళంలో బాగా ఫేమ‌స్ న‌టుడు. 1990లో చాలా సినిమాల‌లో న‌టించాడు శివ‌కుమార్‌. ఆయ‌న వ‌ల్లే సూర్య‌, కార్తిలు హీరోలు కాగాలిగారు. శివ‌కుమార్ తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శివకుమార్ తో సెల్ఫీ తీసుకునేందుకు వ్యక్తి ప్రయత్నించగా ఆ వ్యక్తి ఫోన్‌ను కొట్టాడు. సెల్ఫీ ఇష్టం లేకుంటే వద్దని చెప్తే సరిపోతుంది కాని ఇలా ఫోన్ ను నెట్టేయడం ఏంటని మళ్లీ శివకుమార్ పై విమర్శలు చేస్తున్నారు.

గ‌తంలో కూడా ఇలాగే ఓ అభిమానిపై చేయి చేసుకున్నారు శివ‌కుమార్‌. కొన్ని నెలల క్రితం శివ కుమార్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన సమయంలో అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా ఆ ఫోన్ ను లాక్కొని మరీ కింద పడేశాడు. మ‌ళ్లీ అభిమానిపై దాడి చేయ‌డంతో సూర్య మరియు కార్తీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రెటీ అన్న తర్వాత సెల్ఫీలకు అభిమానులు వెంట పడతారు. అంత‌మాత్ర‌నికే ఇలా చేస్తే ఎలా అంటూ సూర్య, కార్తీ అభిమానులు శివ‌కుమార్‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న మ‌న బాల‌య్య అభిమానులు మా హీరో లాంటి వ్య‌క్తి త‌మిళంలో కూడా ఉన్నారంటూ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

https://www.youtube.com/watch?v=HCce59HRgV0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -