బ్రిటన్కు చెందిన థాంప్సన్ అండ్ మోర్గాన్ సంస్థ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న టైపులో ఒకే మొక్కకు అటు టమాటో.. ఇటు బంగాళదుంపలు పండిస్తున్నారంటా! మరి దీనిని ఏమని పిలివాలి అని మనకు అనుమానం రావచ్చు సో అందుకే దీనికి టామ్ ప్లస్ టాటో కలిపి ముద్దుగా టమ్టాటోగా పిలుస్తున్నారట.అదీ మన ఇంట్లో పెంచుకునే విధంగా దీనిని మరింత అభివృద్ధి చేస్తున్నారు.
అలాగనీ ఇది జన్యుమార్పిడి మొక్క అనుకోవద్ధు. ఎప్పట్నుంచో అనుసరిస్తున్న మొక్కలు అంటు కట్టే విధానంలోనే ఆధునిక పద్ధతులను వీరు అవలంభించారట. గతంలో బ్రిటన్లోనూ టమాటో, పొటాటోను అంటు కట్టినా.. రుచి వంటి వాటి విషయాల్లో వాటిల్లో లోటుపాట్లు ఉన్నాయట. టామ్టాటో విషయంలో ఆ సమస్యలేమీ లేవట. అంతేకాదు.. తొలిసారిగా వాణిజ్యపరంగా విజయవంతమయ్యేలా టామ్టాటోను తీర్చిదిద్దారు. అంటే.. త్వరలో దీన్ని మార్కెట్లోకి విక్రయించేందుకు ముందుకు తేనున్నారు.
