Thursday, May 8, 2025
- Advertisement -

బాఫూన్ లు అయిన టీడీపీ వారు ?

- Advertisement -

2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీ అసంబ్లీ లో ఏది కనపడినా కనపడక పోయినా తెలుగు తమ్ముళ్ళకి జగన్ మీద అనడానికి ఎదో ఒక అంశం ఉంటూనే ఉంటుంది . ఒక విషయం లో అయితే ఎనమల రామ కృష్ణుడు కూడా తీవ్రంగా జగన్ మీద ఆరోపణ చేసేవారు. జగన్ కి నిబంధనలు తెలియవు అనీ సొంతగా తెలుసుకోరు అనీ చెప్పేది అర్ధం కూడా చేసుకునే ప్రయత్నం ఆయన చెయ్యరు అని తెలుగు తమ్ముళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు,. అయితే ఈ విషయం లో జగన్ మోహన్ రెడ్డి ని ఎద్దేవా చేసే ఛాన్స్ కోల్పోయారు తెలుగు తమ్ముళ్ళు.

తాజాగా రోజా సస్పెన్షన్ వ్యవహారం లో రోజా ని ఏడాది పాటు సస్పెన్షన్ చెయ్యగా దాని మీద యనమల వారు తీసుకున్న సెక్షన్ కరక్ట్ కాదు అని జగన్ తీవ్ర స్థాయి లో కోప్పడ్డారు. వారు తీసుకున్న సెక్షన్ ప్రకారం ఒక సెషన్ – కొంత సమయం మాత్రమే ఆమెని సాస్పెండ్ చేసే హక్కు ఉంటుంది అనేది ఆయన వాదన. ఈ వ్యవహారం లో జగన్ కరక్ట్ అని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే జగన్ కి ఏమీ తెలీదు అనీ జగన్ నోట్లోంచి ఒచ్చేవి సగం జ్ఞానం తో ఉండే మాటలు అనీ అంటూ ఉండే అధికార పక్షం ఇప్పుడు బఫూన్ లు అయిపోయారు అంటున్నారు జగన్ సపోర్తర్ లు. 

అయితే తాజాగా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు చూసినప్పుడు.. నిబంధనల మీద అవగాహన లేనిది జగన్ కాదు, ఏపీ అధికారపక్షానికే అన్న విషయం అర్థం కాక మానదు. తాజా పరిణామాల నేపథ్యంలో రూల్స్ గురించి తెలీదు.. జగన్ వాటిని స్టడీ చేయాలన్న వెటకారపు మాట తమ్ముళ్ల నోటి నుంచి వచ్చే అవకాశం లేదు సరికదా.. ఇకపై ఆ మాటలు అంటే జగన్ వంటి చేత్తో వాయించడం ఖాయం!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -