ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రశ్నించిన వారిపై దాడులు లేదా పోలీస్ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఉద్యోగం కావాలంటే కోరిక తీర్చాల్సిందే అంటూ ముస్లిం మహిళను వేధించారు టీడీపీ నేతలు.
సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముస్లిం మహిళను వేధించారు టీడీపీ నాయకులు. ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ముస్లిం మహిళా ఉద్యోగిని పనుల నుండి తొలగించారు టీడీపీ నేత, శానిటేషన్ కాంట్రాక్టర్ యుగంధర్.
తిరిగి ఉద్యోగం ఇవ్వండని వేడుకుంది ముస్లిం మహిళ. ఉద్యోగం కావాలంటే తన కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేశారు మరో టీడీపీ నేత కగ్గాలప్ప. తనకు ఇలాంటివి ఇష్టం లేదని, కావాలంటే డబ్బులిస్తానని ప్రాధేయపడింది ఆ మహిళ. తమ కోరిక తీరిస్తేనే తిరిగి పనిలోకి తీసుకుంటామని టీడీపీ నేతల ఒత్తిడితో తీవ్ర ఆవేదనకు గురైంది.
