Thursday, May 9, 2024
- Advertisement -

వివాదం లో ఇరుక్కున్న టీడీపీ ఎమ్మెల్యే

- Advertisement -
tdp mla controversy

తెలుగు దేశం నాయకులు ఏపీ లో వరసగా వివాదాల్లో ఇరుక్కుంటూ వస్తున్నారు. ఒక రోగికి సకాలం లో వైద్యం ఇవ్వలేదు అంటూ పిఠాపురం ఎమ్మెల్యే వర్మ జూనియర్ డాక్టర్ లని పచ్చి బూతులు తిట్టారు. ఈ క్రమం లో ఒక వైద్యుడి సెల్ ఫోన్ కూడా నేలకేసి కొట్టేసారు.

మిగతా డాక్టర్లను యూజ్ లెస్ ఫెలోస్ అని తిట్టారు. ఎమ్మెల్యే గారి బూతుపురాణాన్ని నిరసిస్తూ వైద్యులు అత్యవసర సేవలు మినహా మిగిలిన విధులన్నీ బహిష్కరించారు. దీంతో ఇపుడు టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ ప్రభుత్వ వైద్యులు అన్నట్లుగా పరిస్థితి ఉంది.ఈ పరిణామంపై మరుసటి రోజు సమావేశమైన డాక్టర్లు వైద్యంలో ఎమ్మెల్యే జోక్యం తగదని తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తమపై దుర్భాషలాడిన ఎమ్మెల్యే వర్మపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. అప్పటివరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -