తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఢిల్లీలో వైద్యులు ఆపరేషన్ నిర్వహించనున్నారు. డాక్టర్ సచ్ దేవ్ ఆధ్వర్యంలో ఆయనకు కంటి ఆపరేషన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా ఆయనకు పరీక్షలు నిర్వహించారు. చుక్కల మందు వేశారు. ఆపరేషన్ ద్వారా ఆయన కుడి కంటిపై పొరను తొలగించనున్నారు.
గతంలో ఢిల్లీకి వెళ్లినప్పుడే కంటి ఆపరేషన్ చేయించుకోవాలని కేసీఆర్ అనుకున్నారు. అయితే మందులతోనే పొరను తొలగించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. కాని అదికుదరకపోవడంతో తాజాగా ఆయనకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలని సూచించారు.
{loadmodule mod_custom,GA1}
కేసీఆర్ కూడా ఆపరేషన్ కు అంగీకరించడంతో… ఈ రోజు శస్త్రచికిత్సను నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ఆపరేషన్ జరగనుంది. శస్త్రచికిత్స తర్వాత మరో నాలుగు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}lZp_yaJjkgM{/youtube}