రాజకీయాలలో మాట మీద కట్టుబడి పార్టీ ఉంది అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం కాకుండా వారికి అన్ని రకాలుగా సాధికారతకు కృషి చేసే పార్టీ కాంగ్రెస్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇందిరా క్రాంతి ద్వారా పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి, ప్రతి మహిళ దగ్గర మినిమం లక్ష రూపాయలు ఉండేలా ఆర్థికంగా అభి వృద్ధి చెందేలా కాంగ్రెస్ పార్టీ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోంది.
టిఆర్స్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత మహిళల ఆర్థిక వృద్ధి, క్షీణించింది. వనపర్తి డిక్లరేషన్ లో ఆసరా పెన్షన్ వచ్చేవారికి కూడా అభయ హస్తం వర్తించేలా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని భరోసా ఇస్తున్నాం. వడ్డీ లేని రుణాలు కోసం వెంటనే నిధులు విడుదల చేస్తాం సింగ్స్ అధికారం లోకి రాగానే ఉద్యోగుల రేగులరైజేషన్ కి సంబధించిన ఫైల్ పైన మొదటి సంతకం. డ్వాక్రా భవనాలకు నిర్మాణానికి ఫండ్ పెంపు, పసుపు,మిర్చి,పంటలకు మద్దతు ధర,లాంటి విషయాలను,ఇలా అనేక రకాల మహిళా అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ వనపర్తి డిక్లరేషన్ చేయడం జరిగింది.
మహిళలపై క్రైమ్ రేట్ పెరిగింది… మహిళలు రాజకీయంగా ఎదిగునప్పుడే మహిళలపై దాడులు తగ్గుతాయి.. 33 శాతం మహిళా బిల్లును వెంటనే ఈ పార్లమెంటులో ప్రవేశ పెట్టాలి, రాజ్యసభలో కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. మహిళలకు 30 శాతం వరకు సీట్లు కేటాయించాలని. కానీ 50 శాతం మహిళలకు కేటాయించాలి. ఇంతవరకు పార్టీలో జరిగింది వేరు ఇప్పుడు వేరు అని రాహుల్ చెప్పారు. పనిచేసేవారికి కచ్చితంగా గుర్తింపు ఇస్తామని రాహుల్ చెప్పారు. గెలిచే మహిళలను గుర్తించి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.