Thursday, May 2, 2024
- Advertisement -

ప్రేమికులకు గుడ్ న్యూస్ : రూ.2.50 లక్షల నజరానా..!

- Advertisement -

ప్రేమ పెళ్లిలు గతంలో కంటే ఈ మధ్య ఎక్కువయ్యాయి. కులాంతర వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రేమించి కులాలు మతాలు తేడా లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య యూత్ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇలా ఇంటర్ క్యాస్ట్ పెళ్లిలు చేసుకునేవారికి ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ. 2.50 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే గతంలో ఇలా కులాంతర పెళ్లిలు చేసుకునేవారికి 50వేలు ఇచ్చేవారు. కాగా ఇప్పుడు దానిని ప్రభుత్వం ఏకంగా ఐదు రెట్లు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకోసం ముందుగా పెళ్లి చేసుకునే జంట దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పెళ్లికి సంబంధించిన ఆధారాలతో వారు స్థానిక జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వధూవరుల ఫొటోలు, ఇద్దరి కుల ధ్రువీకరణ పత్రాలు, వయసు ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రం, వధూవరుల బ్యాంక్ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్, పెళ్లికి సాక్షులుగా ఉన్న వారి వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు సమర్పించాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -