అసలే తెలంగాణా లో తెలుగు దేశం పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఈ సమయం లో కెసిఆర్ తోపు గొప్ప అంటూ ప్రసంసల వర్షం కురిపించిన సుజనా చౌదరి మీద చాలా సీరియస్ గా ఉన్నారు తెలుగు దేశం వారు.
హైదరాబాద్ సురభి ఎడ్యుకేషనల్ సొసైటీలో సౌర విద్యుత్ పై కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమంలో సుజనా చౌదరి పాల్గొన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురూ సమర్థ పాలకులేనని తమ ప్రజల అభివృద్ధి కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నారని కితాబునిచ్చారు. ఇది తెలంగాణా తెలుగు తమ్ముళ్ళ కి నచ్చడం లేదు, తాము ఒక పక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉంటే తమ పార్టీ లో కీలక నాయకుడు పైగా కేంద్ర మంత్రి స్థానం లో ఉన్న వ్యక్తి కెసిఆర్ నీ ఆయన సర్కార్నీ పోగిడేస్తే తమ పోరాటానికి విలువ ఏముంటుంది అనేది తెలుగు దేశం వారి కోపానికి కారణం.
సందర్భం ఏదైనా కావచ్చు కానీ అసలు బాబు కీ కెసిఆర్ కీ మాటలే లేని ఈ తరుణం లో పొరుగు రాష్ట్ర ముఖ్య మంత్రి, తెలంగాణా లో ప్రతిపక్షంగా ఉన్న తమ మంత్రి పొగడడం అనేది టీటీడీపీ శ్రేణులు అసలు జీర్ణించుకోలేక పోతున్నారు.