Friday, May 2, 2025
- Advertisement -

స్కూళ్లకు రేపటి నుండి వేసవి సెలవులు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో 2024-25 విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. రెండు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు సెలవులు ఉండనుండగా జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. మొత్తంగా 50 రోజులు వేసవి సెలవులు రానున్నాయి.

వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే వచ్చే ఏడాది కొత్త పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభం కాగా జూన్ 12 పాఠశాలలు ప్రారంభమయ్యే రోజున విద్యార్థులకు పుస్తకాలను అందజేయనున్నట్లు ప్రభుత్వాలు తెలిపాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 4.5 కోట్లు పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.

వేడిని దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 18 నుంచి పాఠశాలలలో ఒకే సెషన్ విధానాన్ని అమలు చేసింది. ఉదయం 7:45 నుంచి 12:30 వరకు మాత్రమే పాఠశాలలు నడిపి, విద్యార్థుల ఆరోగ్యాన్ని, భద్రతను కాపాడేందుకు చర్యలు తీసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -