Saturday, May 10, 2025
- Advertisement -

భార‌త నౌకాద‌ళ మాజీ అధికారి కుల‌భూష‌న్ జాద‌వ్ ఉరిపై స్టే విధించిన అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం

- Advertisement -
The International court of Justice orders Pakistan to stay Kulbhushan Jadhav execution

అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.18 ఏళ్ల తర్వాత మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్ మీద భారత్ పైచేయి సాధించింది. గూడ చ‌ర్య ఆరోప‌న‌ల‌పై నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్ పాక్ మిల‌ట‌రీ కోర్టు విధించిన‌ ఉరిశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) స్టే విధించింది.

తాము తుది తీర్పు వెల్లడించేవరకు అతడికి విధించిన ఉరిశిక్షను అమలుచేయొద్దని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది.దీంతో జాద‌వ్‌కు ఉరిశిక్ష‌నుంచి కొంత ఊర‌ట ల‌భించింది.
గూఢచర్యం కేసులో పాకిస్థాన్‌ సైనిక న్యాయస్థానం భారత మాజీ నౌకాదళాధికారి జాదవ్‌కు విధించిన మరణశిక్షను రద్దుచేయాలని భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 46ఏళ్ల జాదవ్‌ను పాక్‌ ప్రభుత్వం గతేడాది మార్చి 3న అరెస్టు చేసింది.

{loadmodule mod_custom,Side Ad 1}

గూఢచర్యం, కుట్రలకు పాల్పడ్డారనే అభియోగాలను మోపి ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ భారత్‌ ఐక్యరాజ్యసమితిలో అంతర్భాగమైన అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ నెల 15న విచారణ చేపట్టారు. ఇరు దేశాల వాదనలను 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం రెండు దఫాలుగా ఆలకించింది. ఈ కేసులో భారత్‌ తరఫున హరీశ్‌ సాల్వే, పాక్‌ తరఫున అస్తర్‌ అలీ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అయిన హరీశ్ సాల్వే.. ఈ కేసులో వాదించేందుకు నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకున్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

విదేశీ పౌరుడిని అరెస్టు చేసిన సమయంలో కాన్సల్ జనరల్‌కు అతడిని కలిసేందుకు అవకాశం కల్పించాలని వియన్నా ఒప్పందం చెబుతోంది. కానీ పాక్ మాత్రం ఈ కేసులో జాదవ్‌కు అసలు కాన్సులర్ యాక్సెస్ కల్పించలేదు. దాన్ని కూడా భారత్ ప్రస్తావించింది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని చెప్పింది. భారత్, పాక్ రెండు దేశాలూ వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఉండాలని జడ్జి రోనీ అబ్రహాం చెప్పారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదన్న పాక్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. జాదవ్ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేశారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -