నైట్ ఏంటీ ? 11 లక్షలు ఏంటీ అనుకుంటున్నారు కదా. టైటిల్ చూసి తప్పుగా అనుకోకండి. మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.యువతి , యువకులు కొత్త సంవత్సరం వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. పబ్‌లు ,రెస్టారెంట్‌లు, హోటల్స్ న్యూ ఇయర్ వేడుకులకు రెడీ అవుతున్నాయి. న్యూ ఇయర్ క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి పబ్‌లు ,రెస్టారెంట్‌లు.
డిసెంబర్ 31 రాత్రి కోసం ఒక్క రూము అద్దె తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇదే మరెక్కడో కాదు ,మన ఇండియాలోనే. జోధ్‌పూర్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఒక్క రాత్రి గడిపేందుకు అక్షరాలా రూ. 11.03 లక్షలు తీసుకుంటున్నారు హోటల్ యాజమాన్యం.జోధ్‌పూర్‌లో ప్రతిష్ఠాత్మక ఉమైద్ భవన్‌లో డిసెంబర్ 31 రాత్రి కోసం రూము అద్దె అక్షరాలా రూ. 11.03 లక్షలు. అక్కడే పక్కన ఉన్న ఉదయ్‌పూర్‌లోని తాజ్ లేక్ ప్యాలెస్‌లో రూ. 11 లక్షలు. అంత ఖరీదైనా గది దొరకని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. పింక్ సిటీ జైపూర్‌లో తాజ్‌రామ్ బాగ్ ప్యాలెస్‌లో 31 రాత్రికి రూమ్ ధర రూ. 8.53 లక్షలు. ఇంతకి ఈ హోటల్లో ఎవరు పార్టీలు చేసుకుంటున్నారు అనే కదా మీ అనుమానం. మరెవ్వరో కాదు ఇండియాలోని కుబేరులు అంతా ఇక్కడకు చేరుకుని కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.
గతేడాదితో పోలిస్తే 7 నుంచి 40 శాతం మేరకు గదుల అద్దెలు పెరిగాయి. న్యూఇయర్ సందర్భంగా ఇప్పటికే రూమ్‌లు బుక్ అయిపోయినట్టు హోటల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. గత కొన్నెళ్ల నుంచి రాజస్థాన్ న్యూ ఇయర్ వేడుకలకు వేదికగా మారుతోంది.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ