Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ?

- Advertisement -

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా వేరియంట్ పై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త వేరియంట్ ను నియంత్రించడంపై తీసుకుంటున్న చర్యలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్ పై కోర్టు గురువారం విచారణ చేపట్టింది.

రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రానున్న క్రిస్మస్ , న్యూ ఇయర్ వేడుకలపై తగిన నిబంధనలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని సూచించింది. అలాగే వ్యాధి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గుజరాత్ , ఢిల్లీలో తీసుకుంటున్న విధంగా తెలంగాణలోనూ కఠిన నిబంధనలు రూపొందించాలని దిశా నిర్దేశం చేసింది.

కాగా తెలంగాణలో నిన్న ఒక్క రోజే 14 కేసులు నమోదయ్యాయి. ఇక్క రోజే ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. 11 మంది పురుషులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 38 కి చేరింది. దేశంలోనే తెలంగాణ ఒమిక్రాన్ వ్యాప్తిలో 4వ స్థానంలో నిలిచింది.

సిరిసిల్ల దగ్గరలోని ఒక గూడెంలోని ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఆయన దుబాయి నుంచి వచ్చారు. దీంతో ఆప్రాంతంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో కంటైన్మెంట్ జోన్ సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

నెటిజన్‌ కు సమంత దిమ్మతిరిగే కౌంటర్

చిరంజీవికి ‘అఖండ’సెగ..!

నాగచైతన్య వ్యాఖ్యలు.. సమంతను ఉద్దేశించేనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -