Monday, May 12, 2025
- Advertisement -

టిడిపి ఆయనకు కన్నతల్లి లాంటిదట!

- Advertisement -

ఉత్తరాంద్రకు చెందిన సీనియర్ నేత రాజకీయ బిక్ష పెట్టిన పార్టీని వదిలి ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ భవిష్యత్తును ఇరకాటంలో పెట్టుకున్నాడు.

ఆఖరికి మొన్న సాధారణ ఎన్నికల ముందు జగన్ పంచన చేరాడు. పాపం ఆయనకు దురదృష్టం వెంటాడో లేక కాలం కలిసి రాకో కానీ జగన్ పార్టీ కూడా అధికారానికి అడుగు దూరంలో ఆగి పోయింది. మరోవైపు తన మథర్ పార్టీలో తన కన్నా చిన్న వాళ్ళంతా మంత్రులు అయిపోయారు. ఇప్పుడు తల్లి పార్టీలోకి వెళ్ళాలని ఉన్నా అవమానం జరుగుతుందేమోనన్న అనుమానంతో ఆత్మ రక్షణాలో పడిన పరిస్థితి. తన కింద జూనియర్లుగా చేరిన నేతలతో మథర్ పార్టీలోకి చేరేందుకు మంత్రాంగం జరిపే పరిస్థితి సదరు నేతలకు ఎదురవుతోంది. 

ఇంతకీ అవగాహన లేమితో భవిష్యత్తును అంధకారంలో పడేసుకున్న ఆ నేత ఎవరంటే దాడి వీరభద్రరావు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర పేరెత్తితే ఎర్రం నాయుడు తర్వాత టీడిపిలో టక్కున గుర్తుకొచ్చే పేరు ఆయనదే. సుదీర్ఘ కాలం ఎన్‌టిఆర్ క్యాబినెట్‌లో పని చేశారు. పేరుకు ప్రతిపక్షంలో ఉన్నా మండలి ప్రతిపక్షంలో ప్రతిపక్షనేత హోదాలో బుగ్గ కారులో తిరిగిన ఘనత ఆయనది. ఆయన మైకు పట్టుకున్నాడంటే ఆపోజిట్ వాళ్ళను చీల్చి చెండాడతాడు అన్న పేరుండేది. అలాంటి నేతగా పేరున్న దాడి తనని ఎమ్మెల్సీగా కంటిన్యూ చేయలేదని అలిగి జగన్ పంచన చేరారు. 

జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన కలియుగ దైవం అని పొగిడేవారు. కొడుకు రత్నాకర్‌కు టికెట్ ఇప్పించుకున్నా ఆయన గెలిపించుకోలేక పోయాడు. సరే పార్టీ అధికారంలోకి వస్తే ఏదోక విదంగా సర్దుకుపోదాం అనుకున్నాడు. కానీ ఆ కోరిక కూడా నెరవేరలేదు. పొగిడిన నోటీతోనే జగన్ రాక్షసుడు అని వైసిపికి గుడ్‌బై చెప్పారు. వైసిపిని వీడాక గాని అసలు తాను చేసిన తప్పేంటో వీరభద్రరావుకు అర్థం కాలేదు. 

ప్రస్తుతం దాడి భవిష్యత్తు అడ కత్తెరలో పోక చెక్కలాగా మారింది.  ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు ఆహ్వానిస్తే తాను టీడీపీలో చేరతానని దాడి చెప్పారు. కన్నతల్లి లాంటి టీడీపీని వీడటం తనకు బాధ కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకున్న దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడారు.

నాయకులు ఇలా చొక్కాలు మార్చినంత తేలిగ్గా పార్టీలు మారుస్తున్నారు. విలువల మాటలెలా ఉన్నా ప్రస్తుతానికి పబ్బం గడిస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలైనట్లే రాజకీయాలల్లో నాయకులు వేసే కండువాల రంగులు కూడా వేగంగా మారిపోతాయి మరి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -