Friday, March 29, 2024
- Advertisement -

టిక్ టాక్ చేసి సస్పెండ్ అయింది.. కానీ ఇప్పుడు ఆమె ఓ స్టార్..!

- Advertisement -

అల్పితా చౌదరి అనే లేడీ కానిస్టేబుల్ కొన్నాళ్ల కిందట చేసిన టిక్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే విధి నిర్వహణలో ఆమె టిక్ టాక్ వీడియో చేయడం వల్ల ఆమెను డిపార్ట్ మెంట్ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆ మహిళా పోలీసు గుజరాత్ లో ఓ స్టార్ సింగర్ గా పేరు సంపాధించుకుంది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అల్పిత కొత్త ఆల్బం ‘కచ్చి కేరి, పకీ కేరి’ రిలీజైంది.

ఒకప్పుడు పోలీస్ స్టేషన్ వరకే పరిమితమైన ఆమె ఖ్యాతి ఇప్పుడు గుజరాత్ మొత్తం విస్తరించింది. సెలబ్రిటీ హోదా సంపాధించుకుంది. అహ్మదాబాద్ లోక్ రక్షక్ దళ్ లో అల్పిత కానిస్టేబుల్ గా ఉన్నారు. అయితే ఆమె పోలీస్ స్టేషన్ లాకప్ లో ఆమె టిక్ టాక్ వీడియో చేయడంతో ఆమెపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆమెను కొన్నాళ్లపాటు సస్పెండ్ చేశారు. మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అయినా పాటలు పాడటం మాత్రం ఆపలేదు.

గుజరాతీ జానపద గాయకుడు జిఘ్నేశ్ కవిరాజ్ తో కలిసి అల్పిత పాడిన పాటలకు ప్రజాదరణ లభించింది. ఆ తర్వాత రెండు భక్తిగీతాల ఆల్బంలు చేసింది. తాజాగా గుజరాతీ నటుడు ధవళ్ బారోట్ తో కలిసి చేసిన ‘కచ్చి కేరి, పకీ కేరి’ ఆల్బంలో అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ఇక సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని.. అయితే లాంగ్ లీవ్ కోసం ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అల్పిత తండ్రి కూడా ఓ పోలీసు అధికారి. అల్పితకు నటి, గాయని, మోడల్ కావాలన్నది చిన్నప్పటి నుంచి కల. తండ్రి బాటలో పోలీసు అయినా, గాయనిగానూ సత్తా చాటి తానేంటో నిరూపించుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -