Monday, April 29, 2024
- Advertisement -

మోడీ ని నిలదీసిన చిన్న పిల్లాడు .. మోడీ పరువంతా పోయింది

- Advertisement -
Toddler criticising PM Narendra Modi for demonetisation

రెండున్నర సంవత్సరాలు గడిచిన తన పాలన లో మోడీ తీసుకున్న అతి కఠిన మైన నిర్ణయం ‘ పెద్ద నోట్ల రద్దు ‘ ఇప్పుడు దేశాన్ని ఇబ్బంది పెడుతోంది. పిల్లల పాలు దగ్గర నుంచీ వంట సామాను వరకూ ఏ చిన్న కొనుగోలు కీ డబ్బులు లేక జనం నరకం చూస్తున్నారు. మోడీ కి పెద్ద నోట్ల వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి తన మీదనే చుట్టుకోబోతోంది అనే భయం కూడా ఉన్నట్టుంది. అమలు విషయం లో అట్టర్ ప్లాప్ అయిన మోడీ రెండున్న సంవత్సరాలు ప్రతిపక్షాలతో కూడా తిట్టించుకోలేదు కానీ ఇప్పుడు అందరూ మోడీ మీదనే పడుతున్నారు.

పెద్దనోట్ల రద్దుతో నల్ల కుబేరులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందన్న మాటలు మొదట్లో వినిపించినా.. అంత లేదన్న విషయం రోజులు గడుస్తున్న కొద్దీ అర్థమవుతోంది. రద్దు నిర్ణయాన్ని ప్రకటించి 37 రోజులు పూర్తి అయినా.. నోట్ల కష్టాలతో సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు. ఏ ఏటీఎం ముందు చూసినా.. బ్యాంకు ముందు చూసినా భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. డెబిట్.. క్రెడిట్ కార్డులు లేని వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

నోట్ల రద్దు నిర్ణయం అనంతరం.. సోషల్ మీడియాలో వస్తున్న జోకులు అన్ని ఇన్ని కావు. ఇవి చాలవన్నట్లు.. ఒక బుడ్డోడు.. సామాన్యుల కష్టాల్ని ఏకరువు పెడుతున్న మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బుడ్డోడికి ఒకమహిళ మాటల్నిఅందించటం..వాటిని తూచా తప్పకుండా పిల్లోడు వల్లెవేయటం.. వాటికి తన హావ భావాల్ని యాడ్ చేయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో మోడీ.. ఇలాంటివెన్ని చూడాల్సి వస్తుందో..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -