Monday, May 20, 2024
- Advertisement -

షూటింగ్‌లో టాలీవుడ్ హీరోకు యాక్సిడెంట్.. కాలికి భారీ గాయాలు..

- Advertisement -

ఈ మ‌ధ్య‌న టాలీవుడ్ హీరోల‌కు అస్స‌లు టైమ్ బాగున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. మొన్న‌టికి మొన్న నువ్వు తోపు రా హీరో కార్ యాక్సిడెంట్ అయింది.. ఆ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ కారుకు కూడా పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. ఇప్పుడు తాజాగా మ‌రో టాలీవుడ్ న‌టుడు నాగ‌శౌర్య‌కు యాక్సిడెంట్ అయ్యింది. అయితే ఇది రోడ్డు మీద జ‌రిగిన‌ ప్ర‌మాదం కాదు. షూటింగ్ సెట్లో జ‌రిగిన యాక్సిడెంట్. ఈ ప్ర‌మాదంలో కాలికి భారీగా గాయాల‌య్యాయి. నాగ‌శౌర్య ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నాగ‌శౌర్య‌కు జోడీగా మెహ్రీన్ కౌర్ న‌టిస్తోంది.

భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ఒక‌టి చిత్రీక‌రిస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించిన ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా నాగశౌర్య 15 అడుగుల ఎత్తైన ఓ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకారు. అయితే.. సరైన ప్రదేశంలో ల్యాండింగ్ కాకపోవడంతో మోకాలికి గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం నాగశౌర్యను విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

గాయాన్ని ప‌రిశీలించిన వైద్యులు 25 రోజుల విశ్రాంతి అవ‌స‌రం అని తేల్చారు. దాంతో షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నాగ‌శౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేష‌న్స్ లోనే ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. విశాఖలోని అరిలోవా ప్రాంతంలో 11 రోజుల పాటు షూటింగ్ నిర్వహించాల్సి ఉండగా.. ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -