ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో టాలీవుడ్‌కు చెందిన పెద్దలు సమావేశమయ్యారు. ఇటీవల ప్రత్యేక హోదా సెగలు టాలీవుడ్‌కు పాకాయి. దీంతో అప్రమత్తమైన సినీ ప్రముఖులు ఏం చేయాలో మల్లగుల్లాలు పడ్డారు. తమిళ సినీ పరిశ్రమను ఆదర్శంగా తీసుకొని పలువురు టాలీవుడ్‌కు చురకలు అంటించడంతో ఎట్టకేలకు స్పందించినట్టు కనిపిస్తోంది.
శుక్రవారం (మార్చి 30) సినీ ప్రముఖులు అంతా కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధానకు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రకటించారు. విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పోరాడుతామని చెప్పారు.
సినీ ప్రముఖులు కె. రాఘవేంద్ర రావు, అశ్వనీదత్, కేఎల్ నారాయణ, కేఎస్ రామారావు, జెమిని కిరణ్, కె. వెంకటేశ్వరరావు తదితరులు చంద్రబాబును కలిశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్లబ్యాడ్జీలు సినీ ప్రముఖులు ధరించారు. ఇకపై మీరు పోరాటం చేయండి.. తమ వంతు కృషి చేస్తామని టాలీవుడ్‌కు చెందిన పెద్దలు చెప్పారు.