TTD:దేవుడిపై రాజకీయమా?

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు దేవుడిపై రాజకీయం చేశాడు… చంద్రబాబు చేసిన దుర్మార్గపు ప్రచారం పై భగవంతుడు కళ్లు తెరిచాడు అన్నారు. రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకున్నారు కాబట్టే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి అని మండిపడ్డారు.

భక్తుల భద్రత పట్ల నిర్లక్ష్యం చూపిన టీటీడీ అదనపు ఈవో వెంకన్న చౌదరిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. శ్రీవారి ఆలయం వద్ద శాంతిభద్రతలను కాపాడాల్సిన ఏపీ పోలీస్ అధికారులు తమ బాధ్యత విస్మరించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే… సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ ఘటనకి కారకులెవ్వరో మాట్లాడరా? చెప్పాలన్నారు.

దేవుడిని రాజకీయవనరుగా వాడుకుని తిరుమల అపవిత్రం అయిపోయిందని ప్రచారం చేశారు. స్వామివారి లడ్డూ ప్రసాదంపై చేసిన దుర్మార్గ ప్రచారానికే భగవంతుడు కళ్లు తెరిచాడు.. మా ప్రభుత్వ హయాంలో తిరుమల ఆలయ పవిత్రతను కాపాడాము. ప్రతిపక్షంపై కక్షసాధింపుకు కాకుండా విధినిర్వహణకు పోలీసులను వినియోగిస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కావు అన్నారు. మృతుల కుటుంబాలకు కోటి, క్షతగాత్రులకు రూ.25లక్షలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు భూమన.