- Advertisement -

ప్రచార ఆర్బాటంతోనే ప్రమాదం!

- Advertisement -

తిరుపతి ఘటన అత్యంత దురదృష్టకరం గాయపడ్డవారికి మెరుగైన వైద్యసహాయం అందించాలన్నారు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి. మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం అన్నారు. లక్షలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు.

రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా అనుభవం ఉన్న ఉద్యోగులను మార్చేసి, సమన్వయలోపానికి కారణం అయ్యారు. గతంలో బ్రహ్మోత్సవాలకు కూడా లక్షలాది మంది వచ్చినా ఎంతో నిబద్ధతతో పనిచేశాం అన్నారు. కూటమి ప్రభుత్వం తిరుపతిని ప్రచార ఆర్భాటానికి, రాజకీయ కక్షసాధింపులకు వేదికగా మార్చేసిందని…నాడు చంద్రబాబు హయాంలో 23 మంది మరణించారు, నేడు టోకెన్ల క్యూ లైన్ లో 7 మంది మరణించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆరోపించారు.

గేట్ సడెన్ గా తెరవడంతో 2 వేల మంది ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు అన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట చోటు చేసుకుందని…మృతుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ ఉన్నారు అన్నారు. మిగతా వారు వైజాగ్, నర్సీపట్నం కు చెందిన వారుగా గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చాం…35 మంది క్షతగాత్రులకు రుయా, స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స అందుతుందన్నారు. ఘటనకు గల కారణాలను తెలుసుకుంటున్నాం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -