అమెరికా ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయనను ఒకేసారి రెండు ‘బ్లాక్ రేసర్’ (Black Racer) జాతి పాములు కాటేసాయి. అయితే ఆ పాములు విషపూరితమైనవి కాకపోవడంతో ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. దీంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.
చిన్న నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎలాంటి రక్షణ కవచాలు లేదా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా డాక్టర్ ఓజ్ నేరుగా తన ఒట్టిచేతులతో ఆ పాములను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పాములు ఒక్కసారిగా తిరగబడి అక్కడ ఉన్న ఆరోగ్య మంత్రి కెన్నడీపై దాడి చేసి కాటేశాయి.
బ్లాక్ రేసర్ జాతి పాములు సాధారణంగా చాలా వేగంగా కదులుతాయి. ఇవి మనుషులపై దాడి చేయడానికి వెనకాడవు కానీ వీటికి విషం ఉండదు. ఒకవేళ ఇవి కాటేసినా ప్రాణ నష్టం జరగదు. అయినప్పటికీ ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలా ఒట్టిచేతులతో పాములను పట్టుకోవడంపై నెటిజన్లు, నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి కెన్నడీ క్షేమంగానే ఉన్నారని, వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని సమాచారం.
