వరంగల్ జిల్లా హన్మకొండ భవానీ నగర్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. గురువారం బోగతా జలపాతాలలో నీటిలో మునిగిపోవడంతో 11 ఏళ్ల బాలుడు, ఒక యువకుడు సతీష్ (34) మరణించారు.దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెల్తే భవానీ నగర్‌కు చెందిన ఇరు కుటుంబాలు జయశంకర్ జిల్లా భూపాల పళ్లిలోని బోగతా జలపాతం చూడటానికి విహార యాత్రకు వెల్లారు. కుటుంబ సభ్యుల తో కలిసి బోగత జలపాతానికి వచ్చిన వీరు స్నానం చెయ్యటానికి బండ లపైకి వెళ్ళటం తో ప్రమాదవశాత్తు కాలు జారీ లోయ పడటం తో చనిపోయారు . హర్షిత్ రెడ్డి 6 వ తరగతి చదువుచుండగా సతీష్ హర్షిత్ రెడ్డి వాళ్ళ బోటిక్ షాప్ వర్కర్ గా చేస్తున్నాడు ఈ సంఘటన తో బోగత జలపాతం శోక సముద్రంలో మునిగిపోయింది.
ఈ ప్రమాదంలో రెష్కూటీం ఒకరిని కాపాడినా మిగితా వారిని కాపాడలేకపోయారు. లోతైన జలాల్లో ప్రవేశించకుండా పర్యాటకులను హెచ్చరించినప్పటికీ, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.