మాజీ ప్రధాని వాజ్ పేయి ( Vajpayee funeral ) అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థలంలో వాజ్ పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. సైనిక దళాలు 21 సార్లు గాలిలో తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించాయి. మంచి గంధపు చెక్కల చితిపై వాజ్ పేయి పార్ధివ దేహానికి దత్త పుత్రిక నమిత భట్టాచార్య నిప్పంటించారు.
మన భారత ‘రత్నం’ వాజ్‌పేయి ఇప్పుడు హస్తినలోని యుమునా నదీ తీరంలో శాశ్వతంగా సేద తీరడానికి తరలిపోయారు. బీజేపీ తొలి అధ్యక్షుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో శుక్రవారం (ఆగస్టు 17) సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అటల్‌జీ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితులు వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించారు. బీజేపీ అగ్రనేతలు, అభిమానులు, ఆయన కుటుంబసభ్యులు వాజ్ పేయికి కన్నీటీ వీడ్కోలు పలికారు.