త‌లా , తోకా లేని వీడిపి స‌ర్వే సంస్థ‌

VDP Associates survey election poll surveys

ఏపీలో బీజేపీ- టీడీపీ కూటమికి అధిక ఓట్లు వస్తాయంటూ వీడీపీ అసోసియేట్స్‌ అనే సంస్థ హ‌ల్‌చ‌ల్ చేసింది. టీడీపీ- బీజేపీ కూటమికి 47 శాతం ఓట్లు వస్తే… వైసీపీకి 40 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. జనసేన పార్టీకి మూడుశాతం ఓట్లు వస్తాయంది. మరో ఏడు శాతం మంది మాత్రం ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోలేకపోతున్నారని వీడీపీ సర్వే చెప్పింది.

వీడీపీ సర్వే ఏ మీడియా సంస్థకు అందలేదు గానీ… టీడీపీ అనుకూల పత్రికకు మాత్రం చేరిపోయింది. అయితే ఈ సర్వేలో డొల్లతనం ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది.నీసం గూగుల్‌లో గాలిస్తే ట్వీట్టర్ అకౌంట్ తప్ప… ఏమీ కనిపించదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే సర్వే ఫలితాలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇక లేటెస్ట్ సర్వే చేసిన విధానం ఆశ్చర్యంగానే ఉంది.
దేశం మొత్త మీద 4వేల 120 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే… ఈ సంస్థ సర్వే చేసింది మాత్రమే దేశవ్యాప్తంగా 234 అసెంబ్లీ స్థానాల్లోనే. అది కూడా మొత్తం శాంపిల్స్ కేవలం 14వేల 395. అంటే దేశమొత్తం మీద ఉన్న నాలుగువేలకు పైగా అసెంబ్లీ స్థానాల సంగతి పక్కనపెడితే … సర్వే చేసిన 234 స్థానాలను పరిగణనలోకి తీసుకున్నా పీడీపీ సంస్థ ఒక్క నియోజకవర్గం నుంచి సేకరించిన శాంపిల్స్ సంఖ్య కేవలం 62 మాత్రమే. ఈ వీడీపీ అసోసియేట్స్‌ ఏజెన్సీని నడుపుతున్నది ఎవరో కాదు.. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా 1996- 98 సమయంలో టీడీపీ పెద్దలతో బాగా సన్నిహితంగా మెలిగిన వ్యక్తే దీన్ని నడుపుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మొన్నటి పంజాబ్ ఎన్నికల సమయంలో సర్వేనిర్వహించి ఆప్‌కు 91 స్థానాలు వస్తాయని చెప్పింది ఈ సంస్థ. తీరా అసలు ఫలితాల్లో మాత్రం ఆప్ 20 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌కు 15 స్థానాలు వస్తాయని వీడీపీ సర్వే చెప్పగా.. ఆ పార్టీ ఏకంగా 77 స్థానాలను సొంతం చేసుకుంది.
ఇక ఉత్తరప్రదేశ్‌లోనూ వీడీపీ సర్వే బోల్తా కొట్టింది. బీజేపీకి యూపీలో 190కి మించి రావని ఈ సంస్థ సర్వే చెప్పింది. తీరా అసలు ఫలితాల్లో మాత్రం బీజేపీ ఏకంగా 312 స్థానాలు సొంతం చేసుకుంది. ఇలా ఏమాత్రం విశ్వసనీయత లేని ఈ సంస్థ కేవలం అధికార పార్టీల మెప్పుకోసమే పనిచేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.
అయితే జనసేనకు మూడుశాతం ఓట్లు వస్తాయని వీడీపీ సర్వే చెప్పగా… కొన్ని నెలల క్రితం ఆంధ్రజ్యోతి మీడియా కూడా జనసేనకు 3. 8 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. జనసేన విషయంలో రెండు సర్వేల మధ్య పోలిక ఉండడం గమనార్హం.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}TjzBfDWVcks{/youtube}