Saturday, April 27, 2024
- Advertisement -

పవన్ ఫ్యాన్స్.. కాంగ్రెస్ నేత పంచె ఊడగొడతారా?!

- Advertisement -

పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తాడు కాంగ్రెస్ ఎంపీ వీ హనుమంతరావు. ఎన్నికల ముందు పార్టీ అంటూ హడావుడి చేసిన ఆయన ఎక్కడ? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రజల కోసం పోరాడతా..

ప్రశ్నిస్తా అని ప్రకటించి వెళ్లిన పవన్ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదు? అని వీహెచ్ ప్రశ్నిస్తున్నాడు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు మద్దతు ప్రకటించి.. హామీల అమలకు వారి తరపున తనది హామీ అని చెప్పి వెళ్లిన పవన్ ఎక్కడున్నాడు ? అని వీహెచ్ వ్యాఖ్యానించాడు.

ఇప్పటి వరకూ పవన్ స్పందించలేదని.. ఈ తీరును నిరసిస్తూ పవన్ ఇంటి ముందు తాను ధర్నాకు దిగుతానని వీహెచ్ ప్రకటించాడు. రెండు మూడు రోజుల్లో పవన్ ను కలుస్తానని.. ఆయన ఇంటికి వెళతానని.. అక్కడే ధర్నాకు దిగుతానని వీహెచ్ ప్రకటించాడు. మరి ఈ కాంగ్రెస్ నేత ఇలా మాట్లాడటం ఆసక్తికరంగా ఉంది.

ఈయన నిజంగానే ధర్నాకు దిగితే.. అప్పుడు ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారుతుంది! ఎందుకంటే.. వీహెచ్ గనుక ధర్నా అంటూ పవన్ ఇంటి ముందుకు చేరితే అప్పుడు పవన్ ఫ్యాన్స్ స్పందించే అవకాశాలుంటాయి. తమ అభిమాన హీరో ఇంటి ముందు కాంగ్రెస్ ఎంపీ రచ్చ చేస్తే వాళ్లు సహించలేకపోవచ్చు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా.,.వారు వీహెచ్ పై ఎదురుదాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఈ ఎపిసోడ్ ఎంత వరకూ వెళుతుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -