బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో వచ్చే ఒక ప్రకటన చూసి బెట్టింగ్ పెట్టడం మొదలు పెట్టాను అని ఓ బెట్టింగ్ బాధితుడు వెల్లడించారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదు చేయగా పోలీసులు బెట్టింగ్‌ల బారిన పడి చనిపోయిన వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
ఈ నేపథ్యంలో ఓ బాధితుడు మాట్లాడుతూ..బంగారం తాకట్టు పెట్టి, అప్పు తెచ్చి రూ.80 లక్షలు బెట్టింగ్ లో పెడితే మొత్తం నష్టపోయాను అన్నారు. మొదట్లో మనకు లాభాలు చూపి ఆ తర్వాత వాళ్ల ఊబిలోకి లాగుతారు అని.. కొన్ని రోజుల తర్వాత బెట్టింగ్ కు వ్యసనం అయిపోతారు అన్నారు.
నష్టపోతున్నాం అని తెలిసినా ఇంకా పెడుతూనే ఉంటారు.. నేను అలా రూ.80 లక్షలు నష్టపోయి ఆత్మహత్యాయత్నం కూడా చేశాను అని ఆవేదన వ్యక్తం చేశాడు.బెట్టింగ్ ప్రమోటర్లు, బెట్టింగ్ యాప్ ప్రకటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి..యువత ఈ బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని నెల్లూరుకు చెందిన బెట్టింగ్ బాధితుడు శ్రీరాం బాబు వెల్లడించారు.